సుమంత్…’ఇదం జగత్’ ట్రైలర్

230
sumanth
- Advertisement -

గ‌త ఏడాది మ‌ళ్ళీ రావా అనే డీసెంట్ ల‌వ్ స్టోరీతో హిట్ కొట్టిన హీరో సుమంత్ తాజాగా ఇదం జగత్ అంటూ ప్రేక్షకుల ముందుకువస్తున్నారు. అనిల్ శ్రీకాంతం ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమంత్ సరసన అంజు కురియ‌న్ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఆద్యంతం ఉత్కంఠని రేకెత్తిస్తున్న ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. సుమంత్ చెప్పిన ప‌లు డైలాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

విరాట్ ఫిల్మ్స్, శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నగడ్డల పద్మావతి, శ్రీధర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివాజీ రాజా, సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి…

- Advertisement -