- Advertisement -
వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. హేమాహేమీలతో కూడిన టీమిండియాను 224 పరుగులకే కట్టడి చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 కేవలం పరుగులే చేశారు. 67పరుగులతో కోహ్లి హైఎస్ట్ స్కోర్ చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు మొదట్లోనే షాక్ తగిలింది.
వరుస సెంచరీలు చేసి సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రోహిత్‌శర్మ కేవలం ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత రాహుల్ 30పరుగులకే అవుట్ అయ్యడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లి 67పరుగులు చేసి వెనుదిరిగాడు. ధోనీ (28), విజయ్ శంకర్ (29) ఫర్వాలేదనిపించారు . భారీ షాట్లతో మెరుస్తాడనుకున్న హార్ధిక్ పాండ్యా కూడా 7 ఓవర్లకే పెవిలియన్ చేరాడు.
- Advertisement -