వచ్చే వరల్డ్‌ కప్ ప్రైజ్‌ మనీ ఎంతో తెలుసా..?

291
ICC World Cup 2019

క్రికెట్ అభిమను మళ్లీ సంబరాలు చేయడానికి రెడీ అవుతున్నారు. మరి కొద్దిరోజుల్లో క్రికెట్ వరల్డ్ కప్‌ మొదలుకానుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ నెల 30 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో 10 అగ్రశ్రేణి జట్లు పాల్గొంటున్నాయి.

ఫైనల్ మ్యాచ్ జూలై 14న లార్డ్స్ మైదానంలో జరగనుంది. టోర్నీలో ఈసారి అనుబంధ సభ్య దేశాల జట్లకు స్థానం కల్పించకపోవడం ఆశ్చర్యకరమైన నిర్ణయం. అయితే ఈసారి జ‌రిగే వ‌న్డే క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో నిలువ‌నున్న‌ది.

ICC World Cup 2019

ఈ టోర్న‌మెంట్ చ‌రిత్ర‌లోనే మొట్ట‌మొద‌టిసారి విజేత జ‌ట్టుకు అత్య‌ధిక ప్రైజ్‌మ‌నీ ఇవ్వ‌నున్నారు. ఈ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఫైన‌ల్ విజేత‌కు 28 కోట్ల‌ క్యాష్ అవార్డు ప్ర‌జెంట్ చేయ‌నున్నారు. మొత్తం 10 జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఇక ఫైన‌ల్ టీమ్ విజేత‌కు క్యాష్ అవార్డుతో పాటు ట్రోఫీని కూడా బ‌హూక‌రిస్తారు. క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ కోసం మొత్తం 10 మిలియ‌న్ల డాల‌ర్లు ప్రైజ్‌మ‌నీ కేటాయించారు.

వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచే జ‌ట్టుకు 14 కోట్ల ప్రైజ్‌మ‌నీ వ‌స్తుంది. సెమీఫైన‌ల్ చేరిన జ‌ట్ల‌కు 8 ల‌క్ష‌ల డాల‌ర్లు(5 కోట్ల 61 ల‌క్ష‌లు) ఇస్తారు. వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ మొత్తం 46 రోజులు జ‌ర‌గ‌నున్న‌ది. ఇంగ్లండ్‌లోని 11 మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జ‌రుగుతాయి. లీగ్ ద‌శ‌లోనూ ప్ర‌తి మ్యాచ్‌కు ప్రైజ్‌మ‌నీ ఉంది.