టీ20 వరల్డ్‌కప్ 2026 విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (బీసీబీ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠిన హెచ్చరిక జారీ చేసింది. భారత్‌లోనే మ్యాచ్‌లు ఆడాలని, లేదంటే తక్కువ ర్యాంక్ జట్టుతో బంగ్లాదేశ్‌ను భర్తీ చేసే అవకాశం ఉందని ఐసీసీ స్పష్టం చేసినట్లు వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై జనవరి 21లోపు తుది నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ గడువు విధించిందని తెలుస్తోంది. ఆ గడువు దాటితే బంగ్లాదేశ్ స్థానంలో మరో జట్టును ఎంపిక చేసే దిశగా ఐసీసీ ముందుకు వెళ్లనుందని సమాచారం.
ఐసీసీ నుంచి వచ్చిన ఈ అల్టిమేటం, భారత్‌లో ఆడకూడదనే ఉద్దేశంతో తమ గ్రూప్‌ను మార్చాలని బంగ్లాదేశ్ ఇటీవల చేసిన ప్రతిపాదనకు కొనసాగింపుగా వచ్చింది. టీ20 వరల్డ్‌కప్‌పై నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఐసీసీ ప్రతినిధుల బృందం బంగ్లాదేశ్‌కు వెళ్లి చర్చలు జరిపిన అనంతరం, బీసీబీ ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించింది.
2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న పురుషుల టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా, బంగ్లాదేశ్ తమ గ్రూప్ దశ మ్యాచ్‌లను భారత్‌లో ఆడాల్సి ఉంది. ఐసీసీ నవంబర్‌లో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, బంగ్లాదేశ్ మ్యాచ్‌లు కోల్‌కతా (ఈడెన్ గార్డెన్స్), ముంబై (వాంఖడే స్టేడియం) వేదికలుగా నిర్ణయించబడ్డాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌కు జట్టును పంపించలేమని బీసీబీ వాదిస్తోంది.
ఈ ఏడాది ఆరంభంలో భద్రతా కారణాలతో పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను ఐసీసీ యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే.
Also Read:థైరాయిడ్..బరువు పెరగడానికి కారణమా?

