ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ రిలీజ్ చేసింది ఐసీసీ. ఈసారి వరల్డ్ కప్‌కి యూఏఈతో పాటు ఒమన్ ఆతిథ్యం ఇవ్వబోతోండగా నాలుగు స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికలుగా మ్యాచ్‌లను నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది.
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించబోతోంది. ఈ టోర్నీ ముగిసిన రెండు రోజుల్లోనే టీ20 వరల్డ్‌కప్ ప్రారంభంకానుంది.
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడే క్రికెటర్లు నేరుగా ఐపీఎల్ బబుల్‌లో నుంచి వరల్డ్‌కప్ బయో- సెక్యూర్ బబుల్‌లోకి రానున్నారు. ఇక ఐపీఎల్‌లో ఆడని ఆటగాళ్లు మాత్రం.. టోర్నీకి కనీసం వారం ముందు వచ్చి క్వారంటైన్‌లో ఉండి.. కరోనా వైరస్ పరీక్షల తర్వాత బబుల్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుందని ఐసీసీ వెల్లడించింది.