మరో రెండు మెగా టోర్నీలకు ఐసీసీ ప్లాన్..!

385
icc
- Advertisement -

ఐసీసీ మరో రెండు గ్లోబల్ టోర్నమెంట్‌లను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ తరహాలో వన్డే,టీ20 టోర్నీలు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేసింది. నాలుగేళ్లకోసారి అంటే వన్డే మ్యాచ్‌లను 2025,2029లో టీ 20 ఛాంపియన్స్‌ కప్‌లను 2024,2028లలో జరిపేలా ప్లాన్ చేస్తోంది.

టాప్ టెన్ జ‌ట్లతో 48 మ్యాచ్‌లు నిర్వ‌హించాల‌ని భావిస్తోంది. అయితే 2026, 30ల‌లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లు, 2027, 31ల‌లో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లు షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటికి అద‌నంగా ఒక్కో ఏడాది తేడాతో చాంపియ‌న్స్‌క‌ప్‌లను నిర్వ‌హించాల‌ని భావిస్తోంది.

అయితే ఈ టోర్నమెంట్‌లపై బీసీసీఐ,సీఏ,ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఐసీసీ టోర్నీల వల్ల ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించుకునేందుకు సరైన టైం ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఐసీసీ మాత్రం ఈ టోర్నీలపై అభిప్రాయాలు, సలహాలు సూచనలు తెలిపేందుకు, వచ్చేనెల 15 వ‌ర‌కు స‌భ్య‌దేశాల‌కు గడువిచ్చింది.

- Advertisement -