చిన్నస్వామి స్టేడియానికి గ్రీన్ సిగ్నల్

3
- Advertisement -

ఐపీఎల్ మరియు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న నిషేధానికి తెరపడడంతో క్రికెట్ అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది.

గత ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజేతగా నిలిచిన సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. భద్రతా లోపాలు స్పష్టంగా బయటపడటంతో, ఆ ఘటన జరిగినప్పటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించకుండా ప్రభుత్వం నిషేధం విధించింది.

ఈ నేపథ్యంలో స్టేడియంలో భద్రతా ఏర్పాట్లు, జనసంఖ్య నియంత్రణ, అత్యవసర సేవలు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం, తాజా నిబంధనలు మరియు కఠినమైన షరతులు అమలు చేయాలని ఆదేశించింది. ఈ షరతులకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారుల నివేదికల నేపథ్యంలో మ్యాచ్‌ల నిర్వహణకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో చిన్నస్వామి స్టేడియం మరోసారి దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌కు కేంద్రంగా మారనుంది.

Also Read:ఆఫ్రికా దేశాల్లో ప్రకృతి విలయతాండవం

- Advertisement -