iBOMMA నిర్వాహకుడు అరెస్ట్

5
- Advertisement -

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు పోలీసులు. కూకట్‌పల్లిలో అరెస్ట్ చేశారు CCS పోలీసులు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చారు ఇమ్మడి రవి.

కరేబియన్ దీవుల్లో ఉంటూ iBOMMA వెబ్ సైట్ నిర్వహణ చేస్తున్నారు. iBOMMAపై తెలుగు సినీ నిర్మాతలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

దమ్ముంటే పట్టుకోండి అంటూ గతంలో పోలీసులకు సవాల్ విసిరారు రవి. అరెస్ట్ అనంతరం అకౌంట్‌లో పోలీసులు రూ. 3 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నారు ఇమ్మడి రవి.

Also Read:తిమ్మక్క మరణం బాధ కలిగించింది!

- Advertisement -