పంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రం గా ఉన్న హైదరాబాద్ నగరంలోని టీ హబ్ ను దాదాపు 40 మంది రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం నేడు సందర్శించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగఅధిపతులు టి హబ్ ను సందర్శించారు. టి హబ్ ద్వారా అవిష్కరించిన ఇన్నోవేషన్లను రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు అడాప్ట్ చేసుకోవడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు టి హబ్ కేంద్రంగా జరిగిన ఆవిష్కరణలు దోహద పడేందుకై ఈ పర్యటనను సి.ఎస్. ఏర్పాటు చేశారు. నేడు ఉదయం టి హబ్ ను చేరుకున్న ఐఏఎస్ అధికారుల బృందం టి హబ్ లోని పలు ఇన్నోవేషన్ హబ్ లైన వీ- హబ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్ ), రీసర్చ్, ఇన్నోవేషన్స్ సర్కిల్ ఆఫ్ తెలంగాణా (రిచ్ ), ఇమేజ్ తదితర కేంద్రాలను సందర్శించి వారు రూపొందించిన పలు ఆవిష్కరణలను ఐఏ ఎస్ అధికారులు అత్యంత ఆసక్తిగా పరిశీలించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్స్ వర్క్ షాప్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో స్టార్టప్‌ల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. సమర్థత, జవాబుదారీతనం, పారదర్శకతను పెంచడమే కాకుండా ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరచడంలో కూడా ఈ నూతన ఆవిష్కరణలు సహాయపడతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఉపయోగించుకునే సాంకేతికతలకు అనుగుణంగా ఆయా శాఖల్లో సర్వీస్ డెలివరీ వ్యవస్థను మెరుగుపరచడానికి నూతన ఆవిష్కరణలను అవలంబించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పాఠశాల నుంచే పిల్లల్లో సాంకేతిక స్ఫూర్తిని పెంపొందించాలని, తద్వారా వారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా అందిపుచ్చుకోగలరని ఆయన ఉద్ఘాటించారు.
ఇవి కూడా చదవండి..