లిప్‌లాక్‌కి నేను రెడీ – సామ్‌

266
- Advertisement -

పెళ్ళైన హీరోయిన్స్‌… హీరోలతో లిప్‌లాక్‌, బికినీ సీన్లకు దూరంగా ఉంటారని టాక్‌. కానీ ఇప్పుడున్న హీరోయిన్లు మాత్రం , అబ్బే..అలాంటివి ఉన్నా మాకేం అభ్యంతరం లేదు అనేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరిపోయింది అక్కినేని కోడలు సమంత.

పెళ్ళైన హీరోలు అలాంటి సీన్లలో ఎలా నటిస్తారో.. మేము కూడా అంతే అంటూ సింపుల్‌గా క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవల ‘రంగస్థలం’ ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని చెప్పుకొచ్చింది సామ్‌.

 iam ready to liplock says samantha

‘సీన్ డిమాండ్ చేస్తే లిప్‌కిస్ సీన్లు చేయ‌డానికి నాకేం అభ్యంత‌రం లేదు. ఇవ‌న్నీ నా ప్రొఫెష‌న్‌లో భాగ‌మే. పెళ్లైన హీరోలు ఇలాంటి సీన్ల‌లో ఎలా న‌టిస్తారో, మేమూ అంతే. పెళ్లైన హీరోయిన్ల ప‌ట్ల ఫిల్మ్ మేక‌ర్స్ దృక్ప‌థం మారాలి. ప్రేక్ష‌కులు పాత్ర‌తో క‌నెక్ట్ అయితే ఇంకేమీ ఆలోచించ‌రు. సినిమా వాళ్లు మాత్ర‌మే అలా ఆలోచిస్తార‌’ని స‌మంత చెప్పింది.

మొత్తానికి ‘ఏ మాయ చేసావే’తో లిప్‌కిస్‌లతో స్టార్ట్‌ అయిన సమంత జర్నీ..పెళ్ళైన తర్వాత కూడా సీన్‌ డిమాండ్‌ చేస్తే.. లిప్‌లాక్‌ కి రెడీ అంటోంది. ఎంతైనా అక్కినేని కోడలు రూటే సపరేటు.

- Advertisement -