హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీలో సినీ కార్మికుల కోసం నిర్మించిన డబుల్ బెడ్‌రూంల సముదాయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రాంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇంటితాళాలు, పత్రాలు అందజేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ….నేను సినీ ఇండస్ట్రీకి పెద్దను కాను అని అన్నారు. కొందరు చిన్న వాళ్ళుగా చెప్పుకుంటూ నన్ను పెద్ద వాడ్ని చేస్తున్నారని తెలిపారు.
కార్మికులకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఆదుకుంటానని అన్నారు. సినీ కార్మికులకు కోసం గృహా సముదాయం నిర్మించడం దేశంలోనే ఎక్కడాలేవని చెప్పారు. ప్రభాకర్ దూరదృష్టి వల్లే కార్మికుల సొంతింటి కల సాకారమయిందని కొనియాడారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం సినిమాల పరంగా హిట్లు ఫ్లాప్‌ల మధ్య కొనసాగిందని చెప్పవచ్చు. యేడాది ప్రారంభంలో ఆచార్య అతి పెద్ద డిజాస్టర్‌గా నిలువగా…గాడ్ ఫాదర్ మాత్రం సెమీ హిట్ట్‌గా నిలిచాయి. అయితే ప్రస్తుతం జనవరి12 విడుదల కానున్న వాల్తేరు వీరయ్య సినిమాపైన చిరంజీవి ఆశలు ఉన్నాయి. కొల్లీ బాబీ దర్శకత్వంలో వస్తున్న్ ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తుంది.
ఇవి కూడా చదవండి…