డేటింగ్ చేసినా..ఎవరూ నచ్చలేదు

268
- Advertisement -

విషయం ఏదైనా ఓపెన్‌గా చెప్పేసే సెలబ్రిటీలు కొందరు ఉంటారు. ఎంత ఓపెన్‌గా ఉన్నా… డేటింగ్‌లు వంటి వాటి గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు చాలా తక్కువమందే ఉంటారు. అలాంటి వారిలో ముద్దుగుమ్మ విద్యాబాలన్ ఒకరు. తాజాగా ఈ భామ తన వ్యక్తిగత విషయాల్ని మొహమాటం లేకుండా వెల్లడించింది. పెళ్లి తర్వాత చాలా మంది తమ గతానికి సంబంధించిన విషయాల్ని మరచిపోతారు. కానీ విద్యాబాలన్ మాత్రం అందుకు భిన్నంగా తనకు సంబంధించిన విషయాన్ని ఓపెన్‌గా చెప్పేసింది….

Vidya-Balan

తన భర్త సిద్ధార్థకంటే ముందే తాను కొందరితో డేటింగ్ చేసినట్లు చెప్పింది ఈ భామ. “కొందరితో నేను డేటింగ్ చేసినా… నాకు ఎవరూ నచ్చలేదు. దీంతో ‘ఒంటరిగా ఉంటేనే సుఖం’ అని అనుకున్నా. అలా అనుకొని జీవిస్తున్న సమయంలో సిద్ధార్థరాయ్ కపూర్ పరిచయమయ్యారు. వ్యాపారవేత్త అయిన ఆయనతో మూడేళ్లు డేటింగ్ చేశాను. ‘మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అని చెప్పను కానీ… ‘మెచ్యూర్డ్ లవ్’ మా ఇద్దరిది”అని చెప్పింది విద్యాబాలన్. విద్యాబాలన్ నటించిన కహాని 2 రిలీజ్‌ కు సిద్ధమవుతోంది.

Vidya-Balan

సస్పెన్స్ క్రైమ్ తరహాలో తెరకెక్కిన ఈ సినిమాలో విద్యాబాలన్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ పోషించనున్నట్టు తెలుస్తోంది. కహానీ 2 ప్రమోషన్స్ లో భాగంగా అమ్మడు హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్బంగా పలు ఆసక్తి కరమైన విషయాలను తెలియజేసింది. తెలుగు సినిమాల్లో నటిస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా…మంచి సినిమా అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పుకొచ్చింది.

 5730dccd52a27.image

బాహుబలి దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని ఉందని చెప్పింది. అలాగే హైదరాబాద్‌ స్పెషల్ గా మారిన హైదరాబాద బిర్యానిపై స్పందించింది. నేను హైదరాబాద్ బిర్యాని టేస్ట్ చూడలేదని..ఎందుకంటే నేను శాఖహారి నంటూ బదులిచ్చింది. డర్టీ పిక్చర్‌, కహానీ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడు కహానీ 2తో మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతోంది.

- Advertisement -