నాటీగాళ్‌తో..నో డేటింగ్‌…

204
- Advertisement -

తెలుగులో సరైన సక్సెస్‌ రాకపోవడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తమిళ్,బాలీవుడ్‌లోకి పరుగులు పెట్టింది ఢిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ అమ్మడు సక్సెస్‌లతో యమ జోరు మీదుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంత సక్సెస్ కాకున్నా.. బాలీవుడ్ లో మాత్రం అదుర్స్ అనిపిస్తోంది. ఇదిలా ఉంటే..తాప్సీ ఫుల్ డేటింగ్‌లో ఉందంటూ సోషల్‌ మీడియాలో జోరుగానే హాట్‌టాపిక్స్‌ బయటపడుతున్నాయి.

 'I wouldn't dating with thapsee says sakib saleem

అసలు తాప్సీ పై వస్తున్న డేటింగ్‌ రూమర్స్‌ కి కారణం కూడా తాప్సీయే అవడం షాకింగ్‌. ఎందుకంటే ఈ నాటీగాళ్‌ ఓ వ్యక్తితో ప్రస్తుతం రిలేషన్‌షిప్‌లో ఉన్నానని చెప్పేసింది. అయితే తన ప్రియుడి పేరుని మాత్రం చెప్పడానికి నిరాకరించింది తాప్సీ.

తనతో రిలేషన్ షిప్‌లో ఉన్న వ్యక్తి చాలా ఉన్నతమైన వాడని, అతనితో ఉండటం చాలా సౌకర్యంగా ఉందని చెప్పి అందరికీ షాకిచ్చింది. దాంతో ఒక్కసారిగా తాప్సీ పై హాట్‌ హాట్‌ టాపిక్స్‌ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

 'I wouldn't dating with thapsee says sakib saleem

అయితే ఈ అమ్మడు తన ప్రియుడి పేరు చెప్పనప్పటికీ…తాజాగా యువ నటుడు సాకీబ్ సలీంతోనే తాప్సీ అఫైర్ సాగిస్తోందని రూమర్స్‌ హల్చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ రూమర్స్‌ పై సాకిబ్ స్పందిస్తూ.. అలాంటి వార్తలన్నీ గాసిప్స్ మాత్రమే.. వాటిలో వాస్తవం లేదు అని అన్నాడు.

తమ మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన రిలేషన్ మాత్రమేనని చెప్పాడు. ‘తాప్సీతో నేను డేటింగ్ చేయడం లేదు. ఆమెతో అఫైర్ గురించి చాలా మంది అడుగుతూ విసుగు తెప్పిస్తున్నారు. మా మధ్య అలాంటి రిలేషన్ లేదని నేను వారికి పదే పదే చెప్తున్నాను. తాప్సీ కేవలం నాకు ఫ్రెండ్ మాత్రమే. అంతకంటే మా మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు’ అని సాకిబ్ వెల్లడించాడు.

 'I wouldn't dating with thapsee says sakib saleem

అంతేకాకుండా తానూ.. తాప్సీ… ఢిల్లీకి చెందిన వారమేనని, దాంతో వారి మధ్య పరిచయం బలంగా మారిందని, ఆమెతో కలిసి సమయాన్ని గడపడం తనకు చాలా హ్యాపీగా ఉంటుందని అన్నాడు. తాప్సీకి కూడా పార్టీలు ఎంజాయ్ చేయడమంటే ఇష్టమని, దాంతోపాటు వారి ఇద్దరి అభిరుచులు కామన్‌గా ఉంటాయి అని సాకిబ్ చెప్పారు.

'I wouldn't dating with thapsee says sakib saleem

తాప్సీ, సాకిబ్ ఇద్దరూ కలిసి ఇటీవల తుమ్ హో లగ్తా హై మ్యూజిక్ వీడియోలో నటించారు. ఆ సందర్భంగా వారిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు వారు కలిసి కనిపించారు. గతేడాది తాప్సీ బర్త్‌డే సందర్భంగా వారు చాలా క్లోజ్‌గా ఉన్నట్టు దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు సాకిబ్.

దాంతో వారి మధ్య అఫైర్ ఉందని, తాప్సీతో సాకిబ్ డేటింగ్ చేస్తున్నారనే వార్త వైరల్ అయింది. ఇక ఇదిలాఉంటే..వీరిద్దరూ కలిసి ప్రస్తుతం మక్నా అనే చిత్రంలో నటిస్తున్నారు.

- Advertisement -