రమ్యకృష్ణ పై కృష్ణవంశి సంచలన కామెంట్‌..!

233
I will not cast Ramya in my films
- Advertisement -

తన భార్య రమ్యకృష్ణను తను డైరెక్ట్ చేసే సినిమాల్లో నటింపజేసే ఉద్దేశం లేదని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్‌ చేశాడు దర్శకుడు కృష్ణవంశీ. అసలు రమ్యకు తన సినిమాల్లో ఛాన్స్ ఇవ్వనని చెప్పారు.

రమ్యను ఒక నటిగా చూడలేనని అందుకే తమ కాంబినేషన్ లో సినిమా రాదని దర్శకుడు కృష్ణవంశీ స్పష్టం చేశారు. గతంలో కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ‘చంద్రకళ’ సినిమాలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో కనిపించారు.

 I will not cast Ramya in my films

ఆ తరువాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత కూడా రమ్యకృష్ణ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కృష్ణవంశీ కూడా దర్శకుడిగా బిజీగా ఉన్నారు. ఈ నేపధ్యంలో కృష్ణవంశీ సొంత ప్రొడక్షన్ లో వచ్చిన ‘శ్రీఆంజనేయం’ సినిమాలో రమ్య చిన్న పాత్రలో కనిపించారు.

ఆ తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ నటించలేదు. అయితే ఇటీవల ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రకు గాను ఆమెకు ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలో ఆమెను ప్రధాన పాత్రలో పెట్టి సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా..? అని కృష్ణవంశీను ప్రశ్నించగా ఆయన వెంటనే నో చెప్పేశారు.

I will not cast Ramya in my films

‘‘బాహుబలి’ సినిమాలో రమ్య నటన చాలా బాగుంది. అయితే ఆ పాత్ర అంతగా పండడానికి రచయిత, దర్శకుడే కారణం. ఆ క్యారెక్టర్‌ను చాలా బాగా రాశారు.

తను మంచి నటిని అని ‘అమ్మోరు’, ‘నరసింహ’ సినిమాలతోనే రమ్య నిరూపించుకుంది. అయితే నేను ఆమెను డైరెక్ట్‌ చేయలేను. ఎందుకంటే నేను ఆమెను ఓ ఆర్టిస్టుగా చూడలేను. మా బంధం వ్యక్తిగతమైంది. అందుకే ఆమెను నా సినిమాల్లో తీసుకోను”అని చెప్పాడు కృష్ణవంశీ.

- Advertisement -