నిత్యానంద‌ను పెళ్లిచేసుకుంటా!

148
nithya
- Advertisement -

నిత్యానంద‌ను పెళ్లి చేసుకుంటాన‌ని తెలిపింది న‌టి ప్రియా ఆనంద్. ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఆమె..ఆయ‌న గురించి ఎలాంటి ప్ర‌చారం జరుగుతున్నా వేలాది మంది భ‌క్తులు ఆయ‌న్ని ఆరాధిస్తున్నారని తెలిపింది. ఆయ‌న్ని పెళ్లి చేసుకుంటే ఇంటి పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదని వెల్ల‌డించింది.

దేశంలో ఆశ్రమం నడిపి ప‌లు కేసుల్లో చిక్కుకోవడంతో దేశం విడిచిపోయాడు. ప్రస్తుతం ఎక్కడో ఓ దీవిని కొనుక్కొని కైలాస దీవి అని పేరు పెట్టుకొని అక్కడే ఉంటున్నట్టు ఆయనే తెలిపాడు. అక్క‌డ నుంచే సోష‌ల్ మీడియా ద్వారా త‌న భ‌క్తుల‌కు ట‌చ్‌లో ఉంటున్నారు.

తెలుగులో లీడర్ సినిమాతో పరిచయం అయిన ప్రియా ఆనంద్ ఆ తర్వాత రామరామ కృష్ణకృష్ణ, 180, కో అంటే కోటి సినిమాలతో మెప్పించింది. ఆ తర్వాత తమిళ్, మలయాళం, కన్నడలో వరుస సినిమాలు చేస్తొంది.

- Advertisement -