నడిరోడ్డుపై రెజీనాకు వేధింపులు..!

1085
actress Regina
- Advertisement -

రెజీనా కసాండ్ర తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఎస్‌ ఎం ఎస్‌ ‘శివ మనసులో శృతి’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ సినిమా ఆశించినంత ప్రేక్షకాదరణ పొందలేకపోయినా హీరోయిన్‌గా నిలదొక్కుకోగలిగింది. ఆ తర్వాత వచ్చిన ‘రొటీన్ లవ్ స్టోర్’, ‘పిల్లా నువ్వలేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ తదితర చిత్రాల ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు అటు తమిళం, కన్నడ సినిమాల్లో కూడా చేస్తోంది.

అయితే తాజాగా రెజీనా మిస్టర్ చంద్రమౌళి సినిమా ప్రమోషన్‌లో షాకింగ్ కామెంట్స్‌ చేసింది. చాలా సార్లు లైగింక వేదింపులకు గురయ్యాను అంటూ రెజీనా వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు పలువురు ప్రయత్నించారు. వేధింపులు ఎదురయ్యాయి. అలాగే తనని వేధించాలని చూసిన ఒక యువకుడిని పబ్లిక్ ముందే చితక్కొట్టానని కూడా రెజీనా తెలిపింది. ఈ బ్యూటీ చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

- Advertisement -