అవకాశం వస్తే కేసీఆర్ బయోపిక్‌లో నటిస్తా..

231
Nawazuddin Siddiqui
- Advertisement -

నవాజుద్దీన్ సిద్ధిఖీ బాలీవుడ్లో నటులలో విలక్షణ నటుడిగా పేరుంది. పాత్ర ఏదైనా సరే అందులోకి ఒదిగిపోతారు. తాను చేసిన పాత్రలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోతూ.. స్టార్ డమ్ లకు అతీతంగా ఆయన ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సినిమా అంటే..వైవిధ్యంగా ఉంటుందన్న పేరును స్వల్ప వ్యవధిలో సొంతం చేసుకున్న నవాజుద్దీన్ పై ఇటీవల కాలంలో ఆసక్తికర వార్త ఒకటి వినిపించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేసిన కేసీఆర్ బయోపిక్‌లో నవాజ్ నటిస్తున్నట్లుగా చెబుతున్నారు.

Nawazuddin Siddiqui

కానీ ఈ బయోపిక్‌కు సంబంధించి తననెవరూ సంప్రదించలేదని నవాజుద్దీన్ తెలిపారు. ప్రస్తుతం నవాజుద్దీన్ ‘మంటో’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నవాజుద్దీన్ హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ బయోపిక్ విషయమై స్పందించిన ఆయన ఈ చిత్రానికి సంబంధించి తననెవరూ సంప్రదించలేదని తెలిపారు. కేసీఆర్ వంటి మంచి నాయకుడి బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

- Advertisement -