వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని. ఎంసీఏ సినిమాతో డబుల్ హ్యాట్రిక్‌ని తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నాడు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమా నుంచి లవ్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అడిగా అడిగా ఎదలో లయనడిగా అంటూ ‘నిన్నుకోరి’ చిత్రంలో పసందైన విరహగీతాన్ని వినిపించిన నాని మరోసారి ‘నా కనులే కనని ఆ కలనే కలిశా.. నీ వలనే బహుశా ఈ వరస ’ అంటూ ప్రేమగీతాన్ని వినిపిస్తున్నాడు.
ఇటీవల విడుదలైన నాని పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా ప్రస్తుతం యూ ట్యూబ్‌లో ఈ సాంగ్‌లో ట్రెండింగ్ మారింది. ఈ లవ్ మెలోడీ మ్యూజిక్ .. వినసొంపుగా ఉండటంతో సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. తమిళ సంగీత దర్శకుడు హిప్‌హాప్ చక్కటి బాణీలు అందించగా… రేవంత్, సంజిత్ హెగ్డే స్వరాలను సమకూర్చారు.