ఈ నెల 8వ తేదీన అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అగ్రరాజ్యం పోలింగ్ గురించే తీవ్ర చర్చ జరుగుతోంది. అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుస్తారా? లేక రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజేతగా నిలుస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. పబ్లిక్ పోల్స్ కూడా,,ఇరువురి మధ్య దోబుచులాడుతుండడంతో,,పోరు మరింత రసవత్తరంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు తగ్గరపడుతున్న తరుణంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎన్నికలపై తొలిసారిగా స్పందించాడు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కే నా మద్దతు అంటూ పోస్ట్ చేశాడు. “మీరు గెలుస్తారని భావిస్తున్నా. రాజ్యాంగాన్ని, మానవ విలువలను అనుసరించే నైతిక బలాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్” అంటూ సల్మాన్ ట్వీట్ చేశాడు.
అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఖరారు చేయడంలో భారత సంతతి ఓటర్లు పెద్ద పాత్రే పోషించున్నారు. ఈ నేపథ్యంలో సల్లు భాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సల్మాన్ ఖాన్కు అమెరికాలో ఎంతోకొంత భారత సంతతికి చెందిన ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో సల్మాన్ ఖాన్ మద్దతు వల్ల కొంతమేరకైనా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది.
-
Hope you win. May god give you the strength to follow the constitution and human values. All the best.
#HillaryClintonforpresident