అనీశాతో ప్రేమలో ఎలా పడ్డానంటే..!

199
vishal
- Advertisement -

తమిళస్టార్ హీరో విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన అనీశాను పెళ్లిచేసుకోబోతుండగా అసలు వీరిద్దరికి ఎలా పరిచయం ఏర్పడింది..ఎలా ప్రేమలో పడ్డారు అన్నదానిపై క్లారిటీ ఇచ్చేశాడు విశాల్.

వీధి కుక్కలపై తాను ఓ డాక్యుమెంటరీ తీయలనుకున్నాని ఇందుకోసం అనీశాను కలిశానని తెలిపారు విశాల్. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ అనీశాకు చదివి వినిపించి ఫీడ్ బ్యాక్ అడిగానని తెలిపారు. చర్చల్లో భాగంగా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయని తర్వాత ప్రేమలో పడ్డామన్నారు.

తానే ముందు అనీశాకు ప్రపోజ్ చేశానని తెలిపిన విశాల్ దేవుడే తన కోసం ఆమెను పంపాడని వెల్లడించారు. పెళ్లాయ్యాక అనీశా సినిమాలు మానేస్తుందని తాను చెప్పనని తనకు ఏది నచ్చితే అది చేసుకునే స్వేచ్చ ఉందన్నారు. అనీశా జాతీయ స్థాయి బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణి అని.. సోషల్‌ వర్కర్‌ కూడా అని విశాల్ తెలిపాడు. ఆమెలో ఎవ్వరికి తెలియని ఓ కళ ఉందని.. ఓ పులికి శిక్షణ ఇచ్చి నిమిషాల్లో నిద్రపుచ్చగలదని చెప్పారు.

- Advertisement -