సూర్యతో రకుల్ రొమాన్స్ …!

179
I love to Romance with Surya
- Advertisement -

టాలీవుడ్ అందాల సుందరి రకుల్ ప్రీత్ సింగ్‌కు సూపర్ ఫాలోయింగ్ ఉందనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా తన అభినయంతో ఆకట్టుకుని అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది ఈ బ్యూటీ.  సినిమా సినిమాకీ తన గ్లామర్‌ పెంచుతూ .. కొత్త కొత్తగా ముస్తాబవుతున్న రకుల్ మకుటం లేని మహారాణిగా రాణిస్తోంది. ఇటు టాలీవుడ్‌తో పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి వరుస ఆఫర్లతో ఈ అమ్మడు బిజీగా ఉంది. 2018 చివరి వరకు రకుల్  డైరీ ఖాళీనే లేదట.

ప్రస్తుతం మహేష్‌తో సినిమా చేస్తున్న రకుల్ … నాగచైతన్యతో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కార్తి హీరోగా ‘తీరం అధికారం ఒండ్రు’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు  సెట్స్ పై ఉండగానే మరో స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశాన్ని కొట్టేసింది రకుల్‌. కార్తి అన్నయ్య సూర్య సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎస్‌ 3 సినిమాతో అలరించిన సూర్య విఘ్నేష్ దర్శకత్వంలో స్పెషల్ చబ్బీస్ రీమెక్‌లో నటిస్తున్నాడు. దీని తర్వాత  విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి కమిటయ్యాడు సూర్య.

ఈ చిత్రానికి కథానాయికగా రకుల్‌ని ఎంచుకున్నారు. దీంతో ఒకేసారి అన్న,దమ్ములతో రొమాన్స్ చేయనుంది ఈ పంజాబీ భామ. అంతేగాదు సూర్యతో రొమాన్స్ చేయడాన్ని ఇష్టపడతానని వెల్లడించింది.  ప్రస్తుతం తెలుగులో రకుల్ నటించిన విన్నర్ విడుదలకు సిద్ధమవుతోంది.  దీంతో ఇప్పటికే తెలుగు హీరోలందరినీ ఒక రౌండ్ వేసెసి, టాప్ లీగ్ లోకి చేరిపోయిన రకుల్  తమిళ ఇండస్ట్రీని కూడా చెడుగుడు ఆడేందుకు సిద్ధమైంది.

- Advertisement -