టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్‌లు కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. తొలిసారిగా త్రిపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు జై కొట్టారు.
ముఖ్యంగా జై నామస్మరణతో థియేటర్స్ మారుమ్రోగుతుండగా, ఎన్టీఆర్ నటనికి అభిమానులు జే..జే..లు పలుకుతున్నారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎన్టీఆర్….తాత ఎన్టీఆర్ బయోపిక్‌పై ఆసక్తిర విషయాలను వెల్లడించారు. తాత జీవిత చరిత్రను ఎవరు తీసినా స్వాగతిస్తానని …ఆ సినిమాలో నటించడం ఆషామాషి విషయం కాదన్నారు. ఈ సినిమాలో మీరు నటిస్తారా అనే ప్రశ్నకు… ‘తాత పాత్ర చెయ్యలేనని కాదుగానీ..’ అంటూనే ‘ఆ పాత్ర చేయనుగాక చేయను..’ అని తేల్చేశాడు.
‘ఆయన మహా నటుడు,పొలిటికల్ లీడర్,’ ఆయన ఒక ఫ్యామిలీకి సంబంధించిన వారు కాదని… తెలుగు ప్రజలు అందరి గుండెల్లో దేవుడిగా కొలువుదీరాడని, అలాంటి మహనీయుడి పాత్ర చేయాలంటే గట్స్ కావాలన్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ త్వరలో సినిమా రాబోతుందని బాలయ్య ప్రకటించిన కొద్దిరోజులకే వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ…లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. చాలా గ్యాప్ తర్వాత నేనే రాజు నేనే మంత్రితో వచ్చిన తేజ సైతం ఎన్టీఆర్ బయోపిక్‌పై సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు బాలయ్యను కలిసి కథ కూడా వినిపించినట్లు టాక్. ఈ నేపథ్యంలో స్పందించిన తారక్…రెండు సినిమాలపై అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు.