స్టార్ హీరోలను కాకా పడుతున్న త్రిష…

346
Trisha
- Advertisement -

త్రిష ఎంత మంచి నటో చెప్పడానికి ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘పౌర్ణమి’… ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. అంత మంచి నటి కాబట్టే, పధ్నాలుగేళ్లయినా నటిగా ఆమె ‘స్టేల్’ కాలేదు. నిజానికి ఓ రెండు, మూడేళ్ల క్రితం త్రిష కెరీర్ కొంచెం పడిపోతున్నట్లు అనిపించింది. యువ కథా నాయికలు చాలామంది వచ్చేశారు కాబట్టి, పధ్నాలుగేళ్లుగా చేస్తున్న త్రిష ఇక సర్దుకోవాల్సిందే అని కొంతమంది అనుకున్నారు కూడా. కానీ, అలా జరగలేదు. జస్ట్ చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చేమో కానీ, కెరీర్ డౌన్‌ఫాల్ మాత్రం కాలేదు.

Trisha-Praises-Mahesh-babu-During-Athadu-movie-Completed-12-Years-

తెలుగులో దమ్ము.. లయన్ సినిమాలతో త్రిష మాయమైపోయినట్లే అని చెప్పాలి. అవే ఆమెకు ఆఖరి పెద్ద హీరోల సినిమాలు. అయితే ఇప్పుడు త్రిష తిరిగి తెలుగు పెద్ద స్టార్లకు దగ్గరవ్వడానికి తెగ ప్రయత్నిస్తోంది. నిన్న ఆగస్టు 10 అంటే.. ”అతడు” సినిమా విడుదలై 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు. ఈ నేపథ్యంలో ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది త్రిష. ఆ సినిమాలో చేసిన పూరి పాత్రను ఇంకా మరచిపోలేకపోతున్నానని.. అతడు ఒక క్లాసిక్ అని.. అలాగే ఆ సినిమాలో తనతో చేసిన మహేష్ బాబు ఒక బెస్ట్ కో-స్టార్ అంటూ పొగిడేసింది.

Trisha-Praises-Mahesh-babu-During-Athadu-movie-Completed-12-Years

అయితే ఈ సినిమాపై త్రిష పొగడ్తలు ఎలా ఉన్నా ఇప్పటికే ఇలా పొగిడేసి ఉంటే బాగుండేది.. ఆమెకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. త్రిషకు అన్ని ఆఫర్లు మిస్సయిపోయాయ్. అవకాశాలు లేనప్పడు పెద్ద హీరోలను పొగిడితే వారి సినిమాల్లో అవకాశాలు ఇస్తారు. పాపం.. త్రిష ఈ విషయాన్ని గ్రహించలేకపోయింది. అయితే త్రిషకు పెద్ద హీరోలతో నటించే అవకాశాలు తగ్గాయి కానీ చిన్న హీరోలతో నటించే అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు తమిళంలో అరవింద్ స్వామి సరసన చేస్తున్న సెతురంగ వేట్టై 2 వంటి సినిమాలు అమ్మడు చేతిలో చాలానే ఉన్నాయిలే. పెద్ద హీరోలు కాకపోయినా.. చిన్న హీరోలు ఆమెను ఇంకా బాగానే పట్టించుకుంటున్నారు.

- Advertisement -