నా వల్ల కాదు బాబూ..

240
- Advertisement -

తెలంగాణ ఐటీశాఖ మంత్రిగా తనదైన శైలీలో దూసుకుపోతూనే ట్విట్టర్‌లో ద్వారా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు మంత్రి కేటీఆర్. సాయం కావాలని కోరినా వెంటనే స్పందిస్తాడు    గతంలో ఇలా అనేకమైన ట్విట్లకు స్పందిస్తూ ఆపన్న హస్తం అందించారు. రాజకీయాలే కాకుండా ఇతర విషయాలపై కూడా ట్విట్టర్‌లో ద్వారా ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేస్తాడు. తాజాగా ఓ నెటిజన్ కాస్త భిన్నంగా ట్విట్ చేశాడు.

i do not bother me!

హైదరాబాద్‌లో జరగనున్న ఐపీఎల్ క్రికెట్ సంబంధించి ఇలా ట్విట్ చేస్తూ..‘కేటీఆర్‌ సర్‌.. హైదరాబాద్‌లో జరిగే ఐపీల్‌ మ్యాచ్‌కు వెళ్లేందుకు ఉచితంగా మూడు టికెట్లు ఇప్పించండి సార్’ అంటూ ఒకతను ట్వీట్‌ చేశారు. దీనికి కేటీఆర్ ‘నా వల్ల కాదు బాబూ’ అంటూ రిప్లే ఇచ్చారు. దీంతో పాటు దండం పెడుతున్న ఎమోజీని పోస్టు చేశారు.
ఈ ట్విట్ ను చూసిన వాళ్లంతా కేటీఆర్ నవ్వులు పూయించారని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్‌గా మారంది.

- Advertisement -