టాలీవుడ్ మెగాస్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఖైదీ నెంబర్ 150తో ఎంట్రీ ఇచ్చిన చిరు బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. చిరు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు 150 చిత్రాలు పూర్తిచేసుకున్న మెగాస్టార్ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే, బాస్‌కు మాత్రం ఓ కల తీరకుండా అలానే ఉండిపోయిందట.
23 ఏళ్ల వయసులోనే బిటీష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన పోరాట వీరుడు భగత్ సింగ్.. స్వతంత్ర పోరాటంలో యువతను మేలుకొలిపి విప్లవ బాట పట్టిన భగత్ సింగ్ దేశంలోని ఎంతోమంది ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే అతిచిన్న వయస్సులోనే ఉరికొయ్యలను ముద్దాడి స్వరాజ్య ఆకాంక్షను వెలుగెత్తిచాటాడు. భగత్ సింగ్ తనమనసుపై చెరగని ముద్రవేశాడని అందుకే ఆయన జీవిత చరిత్రను సినిమాగా చేయాలని చిరు భావించాడట.
హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాక.. కెరీర్లో స్థిరపడ్డాక భగత్ సింగ్ పాత్ర చేయాని ఆశపడ్డ రకరకాల కమిట్మెంట్ల వల్ల.. తాను కోరుకున్నపుడు స్క్రిప్టు రెడీ కాకపోవడం వల్ల ఆ పాత్ర చేయలేకపోయానని.. అందుకు చింతిస్తున్నానని అంటున్నాడు చిరు. అయితే ఇప్పుడు భగత్ సింగ్ గా చిరు చేసే అవకాశం లేదు ఎందుకంటే 23 ఏళ్లకే భగత్ సింగ్ ఉరి తీయబడ్డాడు.అప్పటి వయసులా చిరుకి సాధ్యమయ్యే పని కాదు. అందుకే ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
మొత్తంగా భగత్ సింగ్ కథలో నటించకపోయినా ఫ్రీడం ఫైటర్ కథ చేయాలన్న చిరు కోరిక మాత్రం నేరవేరుతోంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాను కూడా మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మించనున్నాడు.