ఏ పాత్ర అయినా ఓకే – తృప్తి డిమ్రి

54
- Advertisement -

యానిమల్ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకొంది ‘తృప్తి డిమ్రి’. ఆ సినిమాలో ఆమె హీరోయిన్ కాకపోయినా సినిమాలో హైలెట్ అయింది ఆమెనే. దాంతో ఈ భామకి తెలుగులో జోరుగా అవకాశాలు వస్తాయని అనుకున్నారు చాలామంది. కానీ ‘తృప్తి డిమ్రి’కి హీరోయిన్ గా మరో అఫర్ రాలేదు. ఐతే, ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న చిత్రంలో మాత్రం ‘తృప్తి డిమ్రి’కి ఓ పాత్ర దక్కింది అని టాక్. ఆమె ఇందులో విలన్ కి కూతురిగా నటించబోతుందట. తండ్రి కోసం జీవితాన్ని కూడా త్యాగం చేసే పాత్రలో ‘తృప్తి డిమ్రి’ నటిస్తోందట.

ఐతే, ఆ సినిమాలో ‘తృప్తి డిమ్రి’ది చాలా చిన్న పాత్ర అని తెలుస్తోంది. ఇదే విషయాన్ని బాలీవుడ్ మీడియా ‘తృప్తి డిమ్రి’ని అడిగితే.. ఆమె స్పందిస్తూ.. “చిన్న పాత్ర అయినా నాకు ఓకే. పాత్రలో దమ్ము ఉంటే హీరోయిన్ గా అవకాశం వచ్చిందా, రెండో హీరోయిన్ గానా అన్నది నేను చూడను. ‘తృప్తి డిమ్రి’ అనగానే మంచి నటి అని గుర్తుకు రావాలి. దాని కోసం నేను ఏమైనా చేస్తాను. యానిమల్ చిత్రంలో నాది చిన్న పాత్ర అయినా పెద్ద గుర్తింపు వచ్చింది కదా,” అని ఈ అమ్మడు చెప్తోంది. ‘తృప్తి డిమ్రి’ వయసు 29 ఏళ్ళు. కానీ అలా కనిపించదు. అందుకే, ఆమెకి ఇంకా చిన్న పాత్రలు దక్కుతున్నాయి.

ఐతే, ‘తృప్తి డిమ్రి’లో మాత్రం హీరోయిన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గ్లామర్, నటన రెండూ ఉన్న భామ కాబట్టి, కచ్చితంగా ‘తృప్తి డిమ్రి’ సౌత్ లో సక్సెస్ అవుతుంది అంటున్నారు. ఇప్పటికే, సౌత్ లో ఇద్దరు మేనేజర్స్ ను పెట్టుకుని మరీ పెద్ద హీరోల సినిమాల కోసం తృప్తి డిమ్రి ఎదురు చూపులు చూస్తోంది. పనిలో పనిగా రీసెంట్ గా ఎన్టీఆర్ పై తనకు ఉన్న అభిమానాన్ని కూడా బాహాటంగానే చెప్పింది. బహుశా ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ వచ్చింది కాబట్టే.. తారక్ గురించి అలా మాట్లాడి ఉంటుంది. ఏది ఏమైనా తృప్తి డిమ్రిలో మ్యాటర్ ఉంది.

Also Read:Mutton:మటన్ ఎక్కువగా తింటున్నారా?

- Advertisement -