నేను మిస్ వరల్డ్..నిక్ వయసు ఏడేళ్లు:ప్రియాంక చోప్రా

82
- Advertisement -

బాలీవుడ్ టూ హాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా తన భర్త అయిన నిక్‌ జొనాస్‌ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ప్రియాంక, నిక్‌ల మధ్య పదేళ్ల వ్యత్యాసం ఉంది. తాను ప్రపంచ సుందరిగా కీరిటం గెలుపొందినప్పుడు నిక్ ఏడేళ్ల పిల్లాడని అని చెప్పింది. ఇది చెప్పాడనికి కొంత వింతగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. నేను ప్రపంచ సుందరిగా కిరీటం గెలుపొందేనాటికి నా వయస్సు 17యేళ్లు. లండన్ వేదికగా జరిగిన ఆ పోటీల్లో నేను పాల్గొన్నాను.

Also Read: రంగబలి జూలై 7న విడుదల

2000లో జరిగిన ఈ టోర్నీలో నిక్ వయస్సు 7 యేళ్లు అంట. ఇంట్లో వాళ్లతోపాటు తను కూడా టీవీ ముందు కూర్చొని నన్ను చూశాడట. తలచుకుంటే వింతగా ఉంది. విధి మా ఇద్దర్నీ కలిపింది. మేము కలవాలని రాసిపెట్టి ఉంది. అందుకే వయస్సు పరంగా ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ మేమిద్దరం ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. నిక్‌తో రిలేషన్‌షిప్‌ కంటే ముందు నేను ఎంతోమందితో డేట్‌ చేశాను. అలాగే నిక్‌ కూడా రిలేషన్స్‌షిప్‌ ఉన్నాయని చెప్పుకొచ్చింది. గతం గూర్చి ఆలోచించడం నాకు నచ్చదు. భవిష్యత్తు కోసం అడుగులు వేయడమే మా ఇద్దరికీ ఇష్టమని ప్రియాంక వివరించింది.

Also Read: నటుడిగా నా తప్పులు నేనే వెతుకుంటా: నాగచైతన్య

- Advertisement -