నేను చిరంజీవికి అభిమానినే!

3
- Advertisement -

టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయడానికి ముందు తన గత వ్యాఖ్యలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తుచేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ప్రచారం చేయడం సరికాదని అన్నారు.

తాను చిరంజీవికి అభిమానినని, ఒక సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్‌ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అయితే నటుడిగా గౌరవం ఒకటి, రాజకీయాల్లో బాధ్యత మరోటి అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించకుండా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ముందుగా క్షమాపణ చెప్పాలని సూచించారు.

Also Read:భారత్‌తో మ్యాచ్ ఆడబోం:పాక్ ప్రధాని

అలాగే ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ దగ్గర బీజేపీ ఎందుకు మోకరిల్లాల్సిన అవసరం వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి స్వంత నాయకత్వం లేదా ప్రజా మద్దతు లేదనే దీనికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

- Advertisement -