ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగా పుస్తక ప్రియులకు ప్రశ్నను సంధించారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. పుస్తక దినోత్సవ పురస్కరించుకొని తను చదువుతున్న పుస్తకాన్ని కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. జేర్డ్ డైమండ్ రచించిన గన్స్, జెర్మ్స్ అండ్ స్టీల్ పుస్తకాన్ని కరోనా లాక్‌డౌన్ సమయంలో రీరీడింగ్ చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ఫోటో షేర్ చేశారు. ఆ పుస్తకపఠనం అనంతరం ఏ చక్కర్డ్ బ్రిలియన్స్ బుక్‌ను చదువనున్నట్టు కవిత తెలిపారు.
ఇందులో భాగంగా ప్రముఖ జర్నలిస్టులు శేఖర్ గుప్తా, ధన్యారాజేంద్రన్, రాహుల్ పండిత, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్, ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, ప్రస్తుతం ఏమేమి పుస్తకాలు చదువుతున్నారు, అవి పూర్తయిన తర్వాత ఏ పుస్తకం చదువుతారన్న విషయాలను ఈ సందర్భంగా షేర్ చేయాలని ట్యాగ్ చేశారు.
#WorldBookDay I am currently RE-reading”Guns,Germs & Steel” probably #Covid19India effect !! 😊Will start “A chequered brilliance” soon.What is your current book ? & the immediate next ? @ShekharGupta @supriya_sule @ShashiTharoor @dhanyarajendran @rahulpandita @VVSLaxman281 pic.twitter.com/JCyynAyWyF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 23, 2020