నేనూ యాక్సిడెంటల్‌ ప్రధానినే: దేవెగౌడ

225
former pm
- Advertisement -

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జీవితాధారంగా వస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘ది యాక్సిడెంటల్‌‌ ప్రైమ్ ‌మినిస్టర్‌’.ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో సినిమా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో జేడీఎస్ చీఫ్,మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు. సినిమా గురించి తనకు తెలియదని కానీ తాను మాత్రం యూక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌నేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమా ప్రారంభమై మూడు, నాలుగు నెలలు గడుస్తోందని ఈ సినిమాకు ఎవరు..ఎందుకు అనుమతిచ్చారో తెలియదన్నారు. నిజాయతీగా చెప్పాలంటే నేను కూడా యాక్సిడెంటల్‌ ప్రైమిమినిస్టర్‌నే అంటూ వ్యాఖ్యానించి టాక్‌ ఆఫ్‌ ది పాలిటిక్స్‌గా నిలిచారు.

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్‌లో మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడు నటుడు అనుపమ్‌ ఖేర్‌ నటిస్తుండగా సోనియా గాంధీ పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో మన్మోహన్‌ను మహాభారతంలోని భీష్మునిగా అభివర్ణించిన దర్శకుడు…. కశ్మీర్‌ వివాదం, అణు ఒప్పందం ప్రక్రియలో భాగంగా పార్టీతో ఆయన విభేదించడం వంటి సున్నితమైన అంశాలను ట్రైలర్‌లో చూపించారు. జనవరి 11న ప్రేక్షకుల ముందుకురానుండగా మరిన్ని వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారే అవకాశం ఉంది.

- Advertisement -