తానేప్పుడు సాధారణ వ్యక్తిగా ఉండేందుకే ఇష్టపడతానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా తాను సాధారణ వ్యక్తి మాదిరిగానే ట్రాఫిక్‌లో ప్రయాణించానని చెప్పారు.
రాకేశ్ వర్మ అనే నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం వీఐపీల కోసం వినియోగించే బుగ్గ కార్లను నిషేధించిన తర్వాత తానెప్పుడు కూడా బుగ్గ కారును కూడా ఉపయోగించలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాకేశ్ వర్మ అనే వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్ చేస్తూ సార్ మీరు పంజాగుట్ట, బంజారాహిల్స్ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ బాగా ఉన్న సమయాల్లో కూడా ఆ ట్రాఫిక్‌లోనే ప్రయాణించారు. మీరు ప్రయాణించిన సమయంలో ఎప్పుడు కూడా ట్రాఫిక్‌ను ఆపలేదు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు.
I never did that even when I was a minister brother. Also never used a Lal/Neela batti ever (much before GoI banned them) https://t.co/xRCwNkMy1O
— KTR (@KTRTRS) August 14, 2019