కత్తి మహేష్.. హైపర్ ఆదిల మద్య వివాదం రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్న వీరిద్దరు తాజాగా ఓ టీవీ చర్చా కార్యక్రమంలో వాడివేడీగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో తన ఆకారంపై హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలపై కత్తి మహేష్ స్పందనకు హైపర్ ఆది ఘాటుగా స్పందించాడు. బిగ్‌బాస్ షోలో ఇతర పార్టిసిపెంట్లు బట్ట అని కామెంట్ చేసినప్పడు ఎందుకు ఊరుకొన్నారు అని ఆది ప్రశ్నించాడు. పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా అతడిని ఎవరైనా అంటే సహించేది లేదు అని ఆది హెచ్చరించారు. కత్తి మహేష్‌కు పొట్ట ఉందని, బట్టతల ఉంది అని నేను అనుకోవడం లేదని, కత్తి మహేష్ క్యూట్ బాయ్. సుత్తి రాజేష్ అనేవాడు మా ఊర్లో ఉండే స్నేహితుడిని ఉద్దేశించి చేసింది. నా ఫ్రెండ్‌కు పెసరట్టు వేయడం కూడా రాదు. దోశలు వేయడం రాదు. కత్తి మహేష్ మాదిరిగానే నా ఫ్రెండ్ సుత్తి రాజేష్ మాట్లాడుతుంటాడు. పవన్ కల్యాణ్‌ను వాడు కూడా విమర్శిస్తుంటాడు అని అన్నాడు.

తర్వాత నాతో ఫోటో దిగి మేమంత బాగానే ఉంటాం. ఫ్యాన్సే వెధవలు అని పోస్ట్ చేయడంపై ఆది మండిపడ్డారు. నేను పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ను. నీవు నన్ను ఉద్దేశించి వెధవ అని అంటావా? నాతో దిగిన ఫొటోను నీవు అలా వాడుకొంటావా అని నిలదీశాడు.ఫ్యాన్స్ అనే వాళ్లు లేకపోతే రివ్యూ అనే పదమే ఉండదు. కొంత మంది రాంగ్.. మరి కొంత మంది రైట్ అంటారు. అందులో భాగమే రివ్యూ. మీ దేవుడికి పొర్లు దండాలు పెట్టుకొంటారో.. అంగ ప్రదక్షిణ చేసుకోండి లేదా అంగచూషణ చేస్తారో మీ ఇష్టం అని కత్తి మహేశ్ పెట్టిన పోస్టుపై హైపర్ ఆది ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరు ఎవరినైనా అంటారు.. కానీ మిమ్మల్ని వేరే వారు అనొద్దు అంటే కుదరదు. మీరు మాట్లాడితే వ్యాపారం. పవన్ ఫ్యాన్స్ మాట్లాడితే అది వ్యభిచారామా అని కత్తి మహేశ్ దుమ్ము దులిపాడు.

మీరు ఫేస్‌బుక్ పెట్టిన పోస్టును మీరు చదువుకోగలవా? ఆ పోస్ట్ చదివితే పవన్ ఫ్యాన్స్ కాదు.. ప్రతీ హీరో ఫ్యాన్స్ కొడుతారు. పవన్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారు. ఆది నన్ను బెదిరిస్తున్నాడు. ఇతర హీరోల ఫ్యాన్స్ బెదిరిస్తున్నాడు అని చెప్పుకొంటు పబ్బం గడుపుకొంటున్నావు. ఎన్నో మంచి పనులు చేస్తున్న పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడిని ఎవరైనా విమర్శిస్తే నేను ఊరుకోను. మాపై అవాకులు చెవాకులు పేలితే ఎంతకైనా తెగిద్దాం అని ఆది అన్నారు.

