సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో హైడ్రా (HYDRAA) అభివృద్ధి చేసిన చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖతో కలిసి జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు స్పష్టమైన సూచనలు చేశారు.
పండుగ వాతావరణానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చేలా ఈ కైట్ ఫెస్టివల్‌ను ప్రజలందరికీ చేరువ చేసేలా రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా తుమ్మిడికుంట చెరువు వద్ద ఐటీ రంగానికి చెందిన ప్రముఖులు, ఐటీ ఉద్యోగులను ప్రత్యేకంగా ఆహ్వానించి వేడుకలు నిర్వహించాలని సూచించారు.
అలాగే కూకట్‌పల్లి నల్లచెరువు చెరువు వద్ద సినీ ప్రముఖులతో, రాజేంద్రనగర్ బురుకుద్ఫిన్ చెరువు వద్ద క్రీడాకారుల భాగస్వామ్యంతో కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమాల ద్వారా చెరువుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, నగర పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.సంక్రాంతి సంబరాలకు నగర ప్రజలు కుటుంబాలతో కలిసి వచ్చి ఆనందించేలా ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అధికారులు భావిస్తున్నారు.
Also Read:Rewind 2025:ఈ ఏడాది చనిపోయిన ప్రముఖులు వీరే!

