హైడ్రా ఎఫెక్ట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు!

5
- Advertisement -

అక్రమ నిర్మాణాల కూల్చివేతల నేపథ్యంలో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి. హైడ్రాతో జనంలో భయాందోళనలు నెలకొనగా గత నెలతో పోలిస్తే రూ.320 కోట్ల మేర ఆదాయం తగ్గిపోయింది.

హైడ్రా కూల్చివేతల ప్రభావం రిజిస్ట్రేషన్ల శాఖపై స్పష్టంగా కనిపించింది. జూలై నెలతో పోలిస్తే భారీగా తగ్గిపోయాయి రిజిస్ట్రేషన్లు. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్గిరి, సంగారెడ్డిలో 58,000 రిజిస్ట్రేషన్లు అయ్యాయి.. ఆగస్టులో 41,200 రిజిస్ట్రేషన్లు అయ్యాయి.

జూలైలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1105 కోట్ల ఆదాయం రాగా, ఆగస్టులో రూ.320 కోట్ల మేర ఆదాయం తగ్గి రూ.785 కోట్లకి పడిపోయింది.

Also Read:యువ శాస్త్రవేత్త కుటుంబానికి సీఎం పరామర్శ

- Advertisement -