- Advertisement -
పాతబస్తీలో అక్రమ కట్టడాల కూల్చివేతలను చేపట్టింది హైడ్రా. హైదరాబాద్ – చాంద్రాయణ గుట్టలోని అక్బర్ నగర్‌లో షాపులను కూల్చేశారు హైడ్రా అధికారులు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పోలీసులకు, పాతబస్తీ వాసులకు మధ్య తోపులాట జరుగగా హైడ్రా జేసీబీ ఎక్కి, జేసీబీ ముందు పడుకొని కూల్చివేతలను అడ్డుకున్నారు స్థానికులు. హైడ్రాకు, రంగనాథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు ఎంఐఎం కార్పొరేటర్లు. నిరసనలు తెలిపిన వారిని అరెస్ట్ చేశారు పోలీసులు.
Also Read:మండాడిలో విలన్‌గా సుహాస్
- Advertisement -

