200 ఎకరాల భూమిని రక్షించాం: రంగనాథ్‌

1
- Advertisement -

200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మీడియా సమావేశంలో మాట్లాడిన రంగనాథ్… 12 చెరువులు, 8 పార్కులను అన్యక్రాంతం కాకుండా హైడ్రా రక్షించిందన్నారు. ఎఫ్ టీఎల్ , బఫర్ జోన్ పై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. త్వరలోనే నగరంలో మరో డాప్లర్ వెదర్ రాడార్ రాబోతుందన్నారు.

వెదర్ డాటాను విశ్లేషించేందుకు హైడ్రా లో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నాం అని…హైడ్రా కు త్వరలో ఒక ఎఫ్ ఎం ఛానల్ కు ప్రయత్నిస్తున్నాం అన్నారు. హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు క్రయవిక్రయాలపై అవగాహన పెరుగుతుందన్నారు. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందని… జూలై తర్వాత అనధికారికంగా, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవాటిపై చర్యలు తప్పవు అన్నారు.

వచ్చే ఏడాది నుంచి ప్రతిసోమవారం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం… ఎఫ్ టీఎల్ లో ఉన్న షెడ్లపై ప్రజలెవరు అద్దెకు తీసుకోవద్దు అన్నారు. ప్రజల ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నాం అని తేల్చిచెప్పారు రంగనాథ్‌.

Also Read:పెళ్లి రోజు..11 మంది అనాధల దత్తత

- Advertisement -