హైదరాబాద్ నగరంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ఇవాళ సచివాలయంలో న్యూడీల్లీ మునిపిపల్ కౌన్సిల్ (ఏన్డీయంసీ) ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఎన్డీఎంసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో పార్కులు, గార్డెనింగ్ పనులను నిర్వహిస్తున్న తీరును మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. హైదరాబాద్ నగరంలోనూ పచ్చదనాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఏన్నడు లేనటువంటి విస్తృత స్దాయిలో హరితహారం కార్యక్రమం చేపట్టామని, ఇప్పటికే వంద కోట్లకు పైగా మెక్కలు నాటామని వారికి తెలిపారు. పట్టణాల్లోనూ పచ్చదనం పెంచాలన్న ముఖ్యమంత్రి అదేశాల మేరకు నగరంలో చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి వివరించారు.
ఈ సమావేశం సందర్భంగా ఎన్డీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రికి వివరించారు. ఢిల్లీలో తమ పరిధిలో సుమారు 1500 ఎకరాల్లో గ్రీన్ బెల్ట్ ఉందని, ఇందులో 7 ప్రధానమైన గార్డెన్స్ ఉన్నాయన్నారు. తాము చేపట్టిన మినీ మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు చేసి వాటి ద్వారా పార్కులకు, ఇతర గార్డెనింగ్ కార్యక్రమాలకు నీటి సరఫరా చేస్తున్నట్లు వివరించారు. వీటి నిర్వహణ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఆదర్శవంతమైన పద్దతులతో పాటు దేశ విదేశాలకు ఎన్డీఎంసీ అధికారులు, తోటమాలీలు అధ్యాయనానికి వెళ్లారని తెలిపారు. తమ సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్కూల్ ఆఫ్ గార్డెనింగ్, గ్రీన్ అంబులెన్స్ను వివరాలను వారు మంత్రికి అందజేశారు.
రెండు రోజుల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఎన్డీఎంసీ బృందం ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావుకు సూచనలు అందించారు. తెలంగాణ లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ గ్రీన్ అది మరింత పెంచేందుకు అవకాశముందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల జీహెచ్ఎంసీ సైతం గార్డెనింగ్ బాగా చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఫ్లైఓవర్లు, వెడల్పు అధికంగా ఉన్న నగర పరిసర ప్రాంతాల్లోని రోడ్లపైన మరింత పచ్చదనం అద్దేందుకు ఉన్న అవకాశాలను వారు వివరించారు. నగరంలోని గార్డెనింగ్, స్ర్టీట్ స్కేపింగ్ పట్ల మంత్రి, ఇతర రాష్ట్రాల్లోని సంస్థను పిలిచి మాట్లాడడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఔటర్ రింగురోడ్డు చుట్టూ హెచ్ఎండీఏ చేపట్టిన గ్రీనరీ నిర్వహాణ, మెక్కల పెంపకాన్ని ఎన్డీఎంసీ బృందం అభినందనలు తెలిపింది.
ఎన్డీఎంసీ తరహాలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి కనీసం 45 స్ధలాలను ఏంపిక చేయాలని జియయ్ యంసి అధికారులకు అదేశాల జారీ చేశారు. పార్కులకు నిర్వహాణ కోసం అవసరం అయిన నీటి కోసం మిని ఏస్టీపీల కోసం ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. దీంతోపాటు ఎన్డీఎంసీ తరహా స్ర్టీట్ స్కెపింగ్ కోసం డీల్లీలో పర్యటించాలని జియచ్ యంసి కమీషనర్ను కోరారు. దీంతోపాటు ఒపెన్ ఏరియాల్లో ఒపెన్ ఏరియా జిమ్ల ఏర్పాటు చేసే ప్రయత్నాన్న మరింత వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ,హెచ్‌ఎండీఏ, పురపాలక శాఖ అధికారులు పాల్గోన్నారు.