ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం..

126
- Advertisement -

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్‌ని మరింత కఠినం చేశారు పోలీసులు. ప్రమాదాల నివారణకు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటుండగా అవి సత్ఫలితాలనిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ నిబంధనలను మరింత స్ట్రిక్ట్ చేశారు. ఇకపై ఎవరైనా ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200, రాంగ్‌ రూట్‌కు రూ.1700 జరిమానా విధించనున్నారు.

రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్‌కి అసలు కారణం వాహనదారులు రూల్స్ సరిగా పాటించకపోవడమే అని పోలీసులు భావిస్తున్నారు.ప్రతి శనివారం, ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవింగ్ నిర్వహిస్తున్న పోలీసులు.. నవంబర్ 28 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నారు. తద్వారా రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నారు.

మోటారు వెహికిల్ చట్టంలోని సెక్షన్ 119/ 177 & 184 కింద రాంగ్‌రూట్‌కి రూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడితే.. రూ. 1200 జరిమానా చెల్లించుకోవాల్సిందే. ఇందుకోసం వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -