మనోజ్‌కు షాకిచ్చిన పోలీసులు

31
manchu manoj
- Advertisement -

హీరో మంచు మనోజ్‌కు షాకిచ్చారు పోలీసులు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడటంతో ఆయనకు ఫైన్ వేశారు. టోలిచౌకి వద్ద నటుడు మంచు మనోజ్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపి, అతని కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తీసివేశారు. అలాగే బ్లాక్ ఫిల్మ్‌ ఉన్న కారును ఉపయోగిస్తున్నందుకు మనోజ్ కు రూ. 700 జరిమానా విధించారు.
బ్లాక్ ఫిల్మ్‌ ఉండకూడదు అంటూ సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది బ్లాక్ ఫిల్మ్ తో కార్లలో తిరుగుతున్నారు. వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.

ఇటీవలె అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్‌ల కార్లకు కూడా బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి, జరిమానా విధించిన విషయం తెలిసిందే.

- Advertisement -