2018ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తామన్నారు గోషా మహాల్ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్. సికింద్రాబాద్, కరీంనగర్ పట్టణాల పేర్లను కూడా మారుస్తామన్నారు. మొదట హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గానే పిలిచేవారని, 1590లో కులీకుతుబ్‌షా హైదరాబాద్‌గా నామకరణం చేశారని ఆయన చెప్పారు. మొగల్ రాజులు, నిజాంల పేరిట ఉన్న పేర్లన్నీ తొలగిస్తామని, దేశం కోసం, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల పేర్లను పెడతామన్నారు.
1590లో కులీ కుతుబ్ షా దాన్ని హైదరాబాద్ అని మార్చేశాడు. మనం మన పాత పేర్లను మళ్లీ పెట్టుకోవాలి. యోగి ఆదిత్యానాథ్ ఫైజాబాద్ పేరును శ్రీఅయోధ్యగా మార్చేసి మంచిపని చేశారు. ఇది కేవలం పేర్ల మార్పు వ్యవహారం కాదు. కోట్లాది మంది హిందువులు డిమాండ్’ అని అన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ వెల్లడించినట్లు చెప్పారు.