అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని అదృశ్యం

19
- Advertisement -

హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని అగ్రరాజ్యం అమెరికాలో అదృశ్యమైంది. 23 ఏళ్ల నితిషా కందుల గత నెల 28 నుండి కనిపించడం లేదని…ఆచూకీ తెలిస్తే చెప్పాలని ఎక్స్ ద్వారా కోరారు పోలీసులు.

కాల్ స్టేట్ యూనివర్శిటీ శాన్ బెర్నార్డినోలో చదువుతోంది నితిషా. ఈ నెల 28న కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నుంచి కనిపించకుండా పోయిందని వెల్లడించారు.

ఇక అమెరికాలో కొద్దిరోజులుగా వరుస మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. చికాగోలో 25 ఏళ్ల తెలంగాణ విద్యార్థి రూపేష్ చంద్ర చింతకింది అనే విద్యార్థి కూడా అదృశ్యమయ్యాడు. చంద్ర విస్కాన్సిన్‌లోని కాంకోర్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. క్లీవ్‌ల్యాండ్ నగరంలో 25 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ అదృశ్యం కాగా శవమై కనిపించాడు.

Also Read:సూపర్‌ఓవర్‌..నమీబియా గెలుపు

- Advertisement -