ఐపీఎల్-12 ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో ప్రకటించని ఐపీఎల్ యాజమాన్యం తాజాగా అప్‌డేట్స్‌ని అందించింది. ఈసారి ఫైనల్ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదిక కానుందని ప్రకటించింది. మే 12వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చెన్నైలో మొదటి క్వాలిఫయర్, విశాఖపట్టణంలో ఎలిమినేటర్‌తో పాటు క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.300 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో స్టేడియంలో ముమ్మర తనిఖీలు ,ఆక్టోపస్ బలగాలు, షీ టీమ్స్,, ట్రాఫిక్ పోలీసులు, అన్ని వింగ్‌ల సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. మ్యాచ్‌లు ఉన్న రోజులో రాత్రి 12 గంటల వరకు మెట్రో ట్రైన్, అదనపు బస్సులు సదుపాయం ఉండేలా ఏర్పాట్లు చేశారు.
ఇక ఇప్పటి వరకు 11 ఐపీఎల్ సీజన్స్ ముగిశాయి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ హోల్డర్‌గా ఉంది. ముంబై ఇండియన్స్,, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టోర్నీని మూడేసి సార్లు గెలుచుకున్నాయి.ఈ సారి టైటిల్ ఎవరి ఖాతాలోకి వెళ్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.