హైదరాబాద్ మెట్రో మరో అరుదైన రికార్డ్..

252
hmr
- Advertisement -

హైదరాబాద్ మెట్రో రైలు మరో రికార్డు సృష్టించింది. ఒక్క రోజులో ఏకంగా 2.95 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి మరో అడుగు ముందుకేసింది. వీకెండ్‌ రోజుల్లో అత్యధికంగా సాధారణ ప్రయాణికులు సైతం తమ విందు, వినోదం, షాపింగ్‌ల కోసం మెట్రో స్టేషన్లను ఎంచుకుంటున్నట్లు తాజా లెక్కలు వెల్లడించాయి. శుక్రవారం ఒక్క రోజే 19 వేల మంది ప్రయాణికులు నమోదు కాగా.. ఇటీవలే ప్రారంభమైన హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌ నుంచి 17,201 మంది ప్యాసింజర్లు మెట్రో సేవలను ఉపయోగించుకున్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పనిచేసే రోజుల్లో 2 మెట్రో రూట్లలో 2.65 మంది ప్యాసింజర్లు సగటున ప్రయాణాలు చేస్తుండగా, వీకెండ్‌లో మాత్రం రోజూ వచ్చిపోయే వారు కాకుండా సాధారణ ప్రయాణికులు (మెట్రో కార్డులు లేనివారు) మెట్రో సేవల వైపు మొగ్గుతుండటం శుభపరిణామమని హెచ్‌ఎంఆర్‌ పేర్కొంటోంది.

వారానికి 5 వేల మంది చొప్పున ప్రయాణికులు అదనంగా యాడ్‌ అవుతున్నారు. మెట్రో స్టేషన్లు నగరంలో మరో కొత్త హ్యాంగవుట్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారబోతున్నాయి. ఇప్పటికే అమీర్‌పేట స్టేషన్‌ పూర్తి వ్యాపార, వినోద కేంద్రంగా మారిపోయినట్లు ప్రయాణికుల లెక్కలే చెబుతున్నాయి. అని మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి చెప్పారు.

- Advertisement -