హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు..మజ్లిస్ గెలుపు

17
- Advertisement -

హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీని దక్కించుకుంది మజ్లిస్. ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో కౌంటింగ్ ప్రారంభం కాగా ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయింది.

మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోల్ కాగా 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా ఓటింగ్‌కు బీఆర్ఎస్ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. MIM నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీ చేశారు.

ఎంఐఎం అభ్యర్థి మీర్జాకు 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. దీంతో ఎంఐఎం గెలుపు లాంఛనమైంది.

Also Read:జీర్ణ సమస్యలకు చెక్ పెట్టండిలా!

- Advertisement -