బేగంపేట మెట్రో స్టేషన్ వద్ద ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాన్ని, స్మార్ట్ పార్కింగ్‌ను ప్రారంభించిన పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, మెట్రో ఎండీ ఎన్వీ ఎస్ రెడ్డి.
ఈ సందర్భంగా పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్.. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకుఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాము. గంటలోపు కారు పూర్తిగా ఛార్జింగ్ చేస్తే… 140 కిలోమీటర్లు తిరుగొచ్చు. మెట్రో రైలు స్టేషన్లులోని అన్ని పార్కింగ్ కేంద్రాల్లో విడతల వారీగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతానికి ఉచితంగా ఛార్జింగ్ చేస్తున్నాం. తర్వాత ఛార్జ్ చేస్తామని ఆయన తెలిపారు.
మెట్రో ఎండీ ఎన్వీ ఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 24 మెట్రో స్టేషన్లులో మొబైల్ ఆప్ ద్వారా స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. మొబైల్ అప్లికేషన్స్ లో పార్కింగ్ కోసం ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. పార్క్ హైదరాబాద్ మొబైల్ యాప్ ద్వారా పార్కింగ్ చేసుకోవాలి. నగర కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ద్వారా కిలోమీటరు కు 2 రూపాయలు పడుతుంది అని అన్నారు.