మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్

136
- Advertisement -

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్. మెట్రో రైలు జర్నీ మరింత ప్రియం కానుంది. నగర ప్రజలపై చార్జీల భారం పడనుంది. టోకు ధరల సూచీ, ద్రవ్యోల్బణం అంచనాలు, వినియోగ వ్యయాలు, మెట్రో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మెట్రో చార్జీలను సవరించనున్నట్లు తెలిసింది.

తొలిదశ మెట్రో ప్రాజెక్టు ఎల్బీనగర్‌– మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌– రాయదుర్గం మూడు మార్గాల్లో 69.2 కి.మీ మేర అందుబాటులోకి వచ్చింది. ఈ మూడు రూట్లలో 57 రైళ్లను నడుపుతున్నారు. నిత్యం సుమారు 4 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ప్రస్తుతం మెట్రోలో కనీస చార్జీ రూ.10 గరిష్టంగా రూ.60 వసూలు చేస్తున్నారు.మెట్రోలో కనీస చార్జీ ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.20కి.. గరిష్ట చార్జీ రూ.60 నుంచి రూ.100కి పెంచే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

 

ఇవి కూడా చదవండి

- Advertisement -