మెట్రో ప్రయానికులకు బంపర్‌ ఆఫర్‌.. 59కే రోజంతా..

90
Hyderabad Metro
- Advertisement -

హైదరాబాద్‌ నగరవాసులకు మెట్రోరైలు శుభవార్త చెప్పింది. రూ. 59కే సూపర్‌ సేవర్‌ మెట్రో హాలీడే కార్డును తీసుకొచ్చింది. ఈ కార్డుతో సెలవు రోజుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎన్నిసార్లయినా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్‌ ఏప్రిల్‌ 2 ఉగాది నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులు, అధికారులతో కలిసి ఎల్‌అండ్‌టీ, ఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ అండ్‌, సీఈవో కెవీబీ రెడ్డి గురువారం రాయితీ టికెట్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా కెవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ఏడాదిలో 100 సెలవు దినాల్లో ఈ కార్డును వినియోగించుకోవచ్చు అన్నారు. ప్రయాణికులు రూ. 50తో (నాన్‌ రిఫండబుల్‌) తొలుత కార్డు తీసుకుని ప్రయాణించాలి అనుకున్నప్పుడు రూ. 59తో రీచార్చ్‌ చేసుకోవాలని సూచించారు.

- Advertisement -