నవంబర్‌ 28న మెట్రో ప్రారంభం..

181
Hyderabad Metro launch by November end
- Advertisement -

మెట్రో రైలు నిర్మాణంలో అసాధారణ జాప్యం ఎన్నడూ జరగలేదన్నారు మంత్రి కేటీఆర్. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ నవంబర్ 28న మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారని తెలిపారు. మెట్రో ఫేజ్ – 2కి తుదిరూపు ఇస్తామన్నారు.

దేశ చరిత్రలో మొదటిసారిగా 30 కిలోమీటర్ల మేర మెట్రోను ప్రారంభిస్తున్నామని చెప్పారు. మొదటి దశ 30 కిలోమీటర్ల మెట్రోను ఈ నెలాఖరులో ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో అని తెలిపారు.

నగరంలో మెట్రో రైలు నిర్వహణ కోసం రూ. 3 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 2,240 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేంద్రం రూ. 1,458 కోట్లు సమకూరుస్తుందన్న మంత్రి.. రూ. 958 కోట్లు విడుదల చేసిందని చెప్పారు.

మెట్రోను పూర్తిస్థాయిలో నడిపించేందుకు 57 రైళ్లు అవసరమన్నారు. అన్ని రైళ్లు కూడా వచ్చాయన్నారు. అన్ని రకాలుగా, అన్ని హంగులతో ప్రారంభానికి మెట్రో సిద్ధమైందన్నారు. మెట్రో రైలు పనుల్లో ఆలస్యం జరిగిందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాయగిరి రైల్వేస్టేషన్‌ను యాదాద్రిగా పేరు మార్చి అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.

- Advertisement -