రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్..

194
holi
- Advertisement -

రాష్ట్రంలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. హోలీ సందర్భంగా ఆదివారం సాయంత్రం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు.

సోమవారం హోలీ పండుగ సందర్భంగా బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై వెళ్లే వ్యక్తులపై, వాహనాలు, స్థలాలపై రంగులు, రంగునీళ్లు చల్లవద్దని నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ద్విచక్రవాహనాలు, కార్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.

- Advertisement -