హైదరాబాద్ కోకాపేటలో భారీ చోరి

590
kokapet
- Advertisement -

హైదరాబాద్ లోని కోకాపేటలో భారీ చోరి జరిగింది. కోకాపేటలోని ఓ వ్యాపారి మత్తు మందు ఇచ్చి నేపాల్ కు చెందిన ఓ జంట దోపిడికి పాల్పడింది. వారం క్రితం ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్ కు చెందిన జంట ఇంటి యాజమాని కుటుంబంతో కలిసిపోయినట్లు నటించారు. వారిపై కుటుంబ సభ్యులకు నమ్మకం ఎర్పడిన తర్వాత వారికి అన్నంలో మత్తు మందు కలిపి దొంగ తనానికి పాల్పడ్డారు.

దాదాపు రూ.3కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు తో పారిపోయారు. వ్యాపారి కుమార్తె ఫిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులు దొంగలు నేపాల్ కు పారిపోతుండగా పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితులను విచారిస్తున్నారు.

- Advertisement -